Tuesday, November 26, 2024

ఓఆర్‌ఆర్ గ్రామాల తాగునీటి కష్టాలకు చెక్

- Advertisement -
- Advertisement -

Drinking water soon for 193 villages within ORR

రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్న వాటర్‌బోర్డు
గతం కంటే అదనంగా50 ఎంఎల్డీ నీరు సరఫరా
56వేల కుటుంబాలకు లబ్ధి ఉంటుందని
మేనేజర్లు వెల్లడి ,ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
వ్యక్తం చేస్తున్న స్థానికులు

హైదరాబాద్ : గ్రేటర్ నగర ప్రజలకు తాగునీటి కొరత లేకుండా సకాలంలో నీటి సరఫరా చేస్తున్న జలమండలి తాజాగా ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాల్లో నీటి సమస్యలేకుండా రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తూ ప్రజల నుంచి బోర్డు ప్రశంసలు అందుకుంటుంది. 07 మున్సిఫల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయితీల్లోని 193 గ్రామాలకు సరఫరా చేస్తుంది. గతంలో ఐదు రోజులకోసారి సరఫరా జరిగేంది, కానీ శు క్రవారం నుంచి రోజు విడిచి రోజుల సరఫరా చేసేందుకు అధికారులు ప్ర ణాళికలు చేసి తాగునీరు విడుదల చే శారు. గతంలో సరఫరా చేసిదానికం టే 50 ఎంఎల్డీల నీటిని అదనంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

దీంతో ఓఆర్‌ఆర్ ప రిధిలోని 56వేలు కుటుంబాలకు ల బ్ధి పొందుతారని చెప్పారు.అదే కొత్త పైపులైన్లు , ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ని యోజకవర్గంలో 17వ డివిజన్‌లో బ ండ్లగూడకు గతంలో 9.4 ఎంఎల్డీ స రఫరా చేయగా అదనంగా మరో 03 ఎంఎల్డీలు, మేడ్చల్ మల్కాజిగిరి 14 వ డివిజన్ బోడుప్పల్ 13ఎంఎల్డీలు చేస్తుండగా ప్రస్తుతం 04 ఎంఎల్డీలు పెంచింది. నాగారం, దమ్మాయిగూడలో 03 ఎంఎల్డీలు చొప్పన అదన ంగా సరఫరా, మహేశ్వరం నియోజకవర్గంలో పరిధిలోని 20వ డివిజన్‌లో మీర్‌పేట్,బడంగ్‌పేట్‌లకు అదనంగా 13 ఎంఎల్డీలు, రాజేంద్రనగ ర్ పరిధిలోని శంషాబాద్, బహదూర్‌గూడ, రషీద్‌గూడ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్‌కు 3.3 ఎంఎల్డీలు అ దనంగా, ఇబ్రహీంపట్నం 25వ డివిజన్‌లోని కుత్బుల్లాపూర్ గ్రామప ంచాయితీకు 0.5 ఎంఎల్డీలు, పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజల్ 2.5 ఎ ంఎల్డీలు, మేడ్చల్ మల్కాజిగిరి 27వ డివిజన్‌లోని తూంకుట, జవహర్‌నగర్‌లకు 7.3 ఎంఎల్డీలు, డివిజన్ 31లోని గుండ్లపోచంపల్లి నిజాంపేటలకు 4.5 ఎంఎల్డీలు, పటాన్‌చెరు 32 డివిజన్‌లో అమీన్‌పూర్,తెల్లపూర్‌లకు 3.5 ఎంఎల్డీలు అదనంగా సరఫరా చేస్తూ ప్రజలకు తాగునీటి కష్టాలకు చెక్ పెట్టినట్లు ఆయా ప్రాంతాలకు చెందిన డివిజన్ మేనేజర్లు పేర్కొంటున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చి హామీ నేరవేర్చామంటున్న కార్పొరేటర్లు….

గతేడాదిలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కెసిఆర్ నేరవేర్చినట్లు పలువురు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీటి సరఫరాకు పైపులైన్లు సక్రమంగా లేవని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారి చేపట్టిన తరువాత మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసినట్లు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News