Saturday, December 21, 2024

బాక్సాఫీసు కలెక్షన్ బద్దలుకొడుతున్న ‘దృశ్యం2’

- Advertisement -
- Advertisement -

ముంబై: అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా, ఇసితా దత్తా, మునాల్ జాధవ్, రజత్ కపూర్ నటించిన ‘దృశ్యం2’ బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ అవుతోంది. ఈ సినిమాకు అభిషేక్ పథక్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ.100 కోట్ల మార్కు దాటేసిన ఆ సినిమా ఇంకా దూసుకెళుతోంది. శుక్రవారం నాడైతే రూ. 7.87 కోట్లు గడించింది. దాంతో అది రూ. 112 కోట్లు రాబట్టిందని తెలిసింది. ఇప్పటికీ సినీ అభిమానులు ఈ సినిమాకే ఫస్ట్ చాయిస్ ఇస్తున్నారు. ట్రేడ్ పండితులైతే ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో దాదాపు రూ. 180 నుంచి 190 కోట్లు రాబట్టగలదని అంటున్నారు.

Drishyam-2-#

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News