Monday, December 23, 2024

రూ.7కోట్ల నగలతో డ్రైవర్ పరార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రూ. 7 కోట్ల విలవైన బంగారు ఆభరణాలతో డ్రైవర్ పరారైన సంఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో  చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నగల వ్యాపారం చేసే రాధిక మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో  నివాసం ఉంటున్నారు. ఆమెకు వచ్చిన ఆర్డర్లు ప్రకారం నగలను సప్లై చేస్తుంటారు. రాధిక ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉండే అనూష రూ.50 లక్షలు విలువ చేసే నగలను ఆర్డర్ ఇచ్చారు. నగలు డెలివరి విషయమై రాధిక అనూషకి పోన్ చేయగా, అనూష బంధువల ఇంటి వద్ద ఉన్నానని అక్కడికి పంపించమని రాధికను అడిగింది. దీంతో అనూష చెప్పిన మధురానగర్ లోకేషన్‌కి రాధిక సేల్స్ మెన్ ను, కారు డ్రైవర్‌ తో నగలను పంపించింది.

అనూషకు డెలివరి చేయాల్సిన నగలతో పాటు సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులో తీసుకెళ్లారు. మధురానగర్ చేరుకున్నాక అనూషకు సంబంధించిన నగలను సేల్స్ మెన్ అప్పగించి వచ్చేసరికి డ్రైవర్ శ్రీనివాస్ కనబడ లేదు. దీంతో సేల్స్ మెన్ జరిగిన విషయాన్ని రాధిక కు తెలియజేశాడు. ఈ ఘటనపై రాధిక ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News