Wednesday, January 22, 2025

ఆ సమయంలో డ్రైవర్లు ఫోన్‌లో క్రికెట్ చూస్తున్నారు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆంధ్రప్రదేశ్‌లో గత ఊడాది అక్టోబర్ 29న 14 మంది ప్రయాణికుల మరణానికి కారణమైన రెండు రైళ్లు ఢీకొన్న ఘటన జరిగిన సమయంలో ఒక రైలుకు చెందిన డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ తమ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని కంటకపల్లి వద్ద హౌరా-చెన్నై లైనుపై విశాఖపట్నం పలాస రైలును రాయగడ పాసింజర్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. భారతీయ రైల్వేలు చేపడుతున్న కొత్త భద్రతా చర్యలను గురంచి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ప్రమద ఘటనను ప్రస్తావించారు.

క్రికెట్ మ్యాచ్ చూస్తూ లోకో పైలట్, సహ లోకో పైలట్ నిమగ్నమైపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఈ ఘటన సంభవించిందని ఆయన తెలిపారు. లోకో పైలట్లు తమ దృష్టిని పూర్తిగా రైలు నడపడం పైనే నిమగ్నం చేసేందుకు వీలుగా తాము కొత్త వ్యవస్థలను తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన కమిషనర్స్ ఆఫ్ రైల్వే సేఫ్టీ తన నివేదికను బహిర్గతం చేయనప్పటికీ ఘటన జరిగిన మరుసటి రోజు జరిగిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రాయగడ పాసింజర్ రైలుకు చెందిన ఇద్దరు డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తూ పనిచేయని రెండు ఆటో సిగ్నల్స్‌ను దాటి ప్రమాదానికి కారకులయ్యారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు డ్రైవర్లు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News