Wednesday, January 1, 2025

ఆటో డ్రైవర్ దాడిలోనే దల్బీర్ మృతి

- Advertisement -
- Advertisement -

జలంధర్ : పంజాబ్ పోలీసు అధికారి దల్బీర్ సింగ్ డియోల్ హత్యోదంతంలో స్థానిక పోలీసులు చురుగ్గా స్పందించారు. అర్జున్ అవార్డు గ్రహీత , ఉద్యోగంలోకి రాకముందు వెయిట్ లిఫ్టర్ అయిన దల్బీర్ బుధవారం హత్యకు గురయ్యారు. తలపై బుల్లెట్ గాయాలతో పడి ఉండగా దల్బీర్‌ను గుర్తించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఈ కేసులో అనుమానిత వ్యక్తిని కేవలం 48 గంటల్లోనే పట్టుకున్నారు. ఓ ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసిన దశలో ఈ హత్య గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోడ్రైవర్‌కు, ఈ పోలీసు అధికారికి మధ్య జరిగిన జగడం చివరికి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో దల్బీర్ దగ్గర ఉన్న సర్వీసు రివాల్పర్‌ను లాక్కుని దగ్గరి నుంచి కాల్పులు జరపడం మృతికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News