Monday, January 20, 2025

ఆయిల్ టిన్లులు చోరీ.. డ్రైవర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఫ్రీడమ్ ఆయిల్ టిన్లులను చోరీ చేసిన డ్రైవర్‌ను బహదుర్‌పుర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 210 టిన్లులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….హైదరాబాద్, మలక్‌పేటకు చెందిన టుమ్ము సాయినంద కిషోర్ అలియాస్ సత్యనారాయణ, అలియాస్ అక్షయ్ అలియాస్ రాజేష్‌కుమార్ అలియాస్ శేషాద్రి కుమార్ అలియాస్ సంజయ్‌కుమార్ అలియాస్ చిన్నా అలియాస్ సంతోష్ అలియాస్ చిన్నా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఎపిలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్‌కె లైన్స్ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌లో 1,100 ఫ్రీడమ్ ఆయిల్ టిన్లులను లారీలో లోడ్ చేశారు. వాటిని హైదరాబాద్‌లో డెలివరీ ఇవ్వాల్సి ఉంది. వాటిని తీసుకుని బయలుదేరిన డ్రైవర్ హైదరాబాద్‌లో 890 టిన్లులను మాత్రమే డెలివరీ చేశాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు మేనేజర్ బహదుర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News