Monday, December 23, 2024

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్, వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది.స్నేహితులతో కలిసి హోటల్ కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడు తోపాటు మరొకరు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే.. నిర్మల్ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు కంప్లైట్ చేసింది. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది బాధితురాలు. వెంటనే అప్రమత్తమైన సిటీ పోలీసులు.. బస్ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. హరికృష్ణ ట్రావెల్ బస్సుకు సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News