- Advertisement -
జైపూర్: ట్రక్కులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవదహనమైన ఘటన రాజస్థాన్, అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తబ్జి గ్యాస్ ప్లాంట్ సమీపంలో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్ హనుమాన్ ట్రక్కు క్యాబిన్ లోనే చిక్కుకుపోయి మంటల్లో కాలిపోయి మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రక్కులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. రహదారిపై పూర్తిగా కాలిపోయిన ట్రక్కును తొలగించి, ట్రాఫిక్ ను క్లియర్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద మహిళా మృతదేహం లభ్యం..
- Advertisement -