Monday, December 23, 2024

వరికోత మిషన్ అదుపుతప్పి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగుల రాజు వరి కోత మిషన్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొదుతున్నాడు. వరి కోతల సీజన్ లో వేరే జిల్లాకు బయల్దేరుతుండడంతో ప్రమాదవశాత్తు అదే మిషన్ కింద పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘణ్‌పూర్ మండలం తాన్‌దార్‌పల్లికి చెందిన రాగుల రాజు (22) హార్వెస్టర్ నడుపుకుంటు సొంతగ్రామానికి వెళ్తున్న సమయంలో నాగారం మండలంలోని ఫణిగిరి స్టేజీ శివారులో అకస్మాత్తుగ హార్వెస్టర్ ( వరికోత మిషన్ ) శుక్రవారం ఉదయం గం.5.00 సమయంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కకు వెళ్లడంతో అదుపుతప్పి హార్వెస్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇట్టి విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్‌ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News