- Advertisement -
మైలార్ దేవ్ పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది.బోగి పండుగ రోజున డ్రైవర్ అసద్ ప్రాణాలు కోల్పోయాడు. .డిసిఎం డోరు ట్రాన్స్ ఫార్మర్ కు తగలడంతో విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.కరెంటు షాక్ దాటికి డ్రైవర్ కుడి చేయి కాలి బూడిద అయ్యి చేయి ఎముకలు బయట పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్ పూర్తిగా కాలి బూడిదయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అసద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -