Monday, December 23, 2024

ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

పినపాక:పినపాక మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామం వద్ద పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ చక్రాలను మట్టి చుట్టుకొని బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. స్ధానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన మునిగల భాస్కర్(35) కొన్నాళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇది గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్ధలానికి హెడ్ కానిస్టేబుల్ దిలీప్ చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News