Saturday, December 21, 2024

ఆటోపై కూలిన చెట్టు…డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెట్టు ఆటోపై కూలడంతో డ్రైవర్ మృతిచెందిన సంఘటన నగరంలోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలోని ఫుట్‌పాత్‌పై శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. డ్రైవర్ గౌస్ పాషా ఆటో డ్రైవింగ్ చేస్తూ హైదర్‌గూడలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఆగి ఉన్న రెండు ఆటోలపై కూలడంతో ఆటో డ్రైవర్ గౌస్‌పాషా అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చెట్టుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూడా కూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఆర్‌ఎఫ్ బృందాలు రోడ్డు మీద నుంచి చెట్టును తొలగించాయి. అనంతరం వాహనాల రాకపోకలను అనుమతించారు. ఆటోడ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News