Sunday, November 24, 2024

డ్రైవరే ప్రతిమ ప్రాణాలు తీశాడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో జరిగిన గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్య కేసులో కొందరు గనుల యజమానుల హస్తం ఉండవచ్చని భావిస్తున్న పోలీసులకు, ఆమె ‌డ్రైవరే హంతకుడని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు.

కేసు వివరాలను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ విలేఖరులకు వెల్లడించారు. ప్రతిమ వద్ద కిరణ్ (30) అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేసేవాడు. ప్రతిమ అక్రమ క్వారీలపై దాడులకు వెళ్తున్నప్పుడు, ఆ సమాచారాన్ని కిరణ్ లీక్ చేసేవాడు. దాంతో పది రోజుల కిందట ప్రతిమ అతనిని పనిలోంచి తొలగించారు. దాంతో  కిరణ్ కక్ష పెంచుకున్నాడు.  శనివారం పొద్దుపోయాక ప్రతిమ ఇంటికి వచ్చి తనను తిరిగి పనిలో పెట్టుకోవాలని ప్రాధేయపడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో ప్రతిమపై దాడి చేసి, గొంతుకు వైరు బిగించి, తర్వాత కత్తితో గొంతు కోసి చంపాడని కమిషనర్ దయానంద్ చెప్పారు. కిరణ్ ను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చామరాజనగర్ జిల్లా మలెమహదేశ్వర బెట్ట పరిధిలో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇటీవల హుణసమారెనహళ్ళి, సొణ్ణప్పహళ్లి చుట్టుపక్కల జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ పై ప్రతిమ సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో ఒక ఎమ్మెల్యేపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె హత్య వెనుక గనుల యజమానుల హస్తం ఉండి ఉండవచ్చునని పోలీసులు మొదట అనుమానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News