Monday, March 17, 2025

“అమర్యాద” పై స్పందించిన ఆర్టిసి

- Advertisement -
- Advertisement -

అనుచితంగా మాట్లాడిన డ్రైవర్ దురుసు ప్రవర్తన పై ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుకు బస్ భవన్ స్పందించింది. కటువుగా,దురుసుగా, అనుచితంగా మాట్లాడిన డ్రైవర్‌పై విచారణ చేపట్టాలని నల్లగొండ ఆర్టీసీ అధికారులను “హెడ్ ఆఫీస్” ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటి తహశీల్దార్గా నల్లగొండలో పని చేస్తున్నారు మాచన రఘునందన్. శనివారం నాడు ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ రావడం కోసం ఎల్ బి నగర్ లో టిఎస్07జడ్4038 నంబర్ నాన్ స్టాప్ బస్ ఎక్కారు.”బస్ హయత్ నగర్ లో ఆగదు” అని కంట్రోలర్ చెప్పిన విషయాన్ని.. బస్ డ్రైవర్‌కు రఘునందన్ హయత్ నగర్ లో ఆపినందుకు గుర్తు చేశారు.

దీనికి డ్రైవర్ దురుసు గా స్పందిస్తూ.. నీ టికెట్ వాపస్ ఇచ్చి, దిగిపో. “నీకు చెప్పినామెనడుగు పో..”అంటూ కటువుగా..అమర్యాద‌గా మాట్లాడాడు. మీరు నన్ను “నువ్వు” అని సంబోధిస్తున్నారు.నేను మీ పై అధికారులకు ఫిర్యాదు చేస్త అని రఘునందన్ హెచ్చరించినా.. కానీ డ్రైవర్ మరింత దురుసుగా కటువుగా.. “ఏంది.. ఓ..ఒర్లుతున్నావ్..ఆ..” అంటూ.. ప్రయాణికులందరి ముందు, రఘునందన్ పట్ల అమర్యాదగా మాట్లాడాడు. ఈ విషయం పై ,రఘునందన్ బస్ లో జరిగిన అవాంచనీయ సంఘటన తో డ్రైవర్ దురుసు ప్రవర్తన తో మనస్తాపానికి గురయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు.నల్లగొండ ఆర్టీసీ ఆర్ ఎం కు , డి ఎం కూ వాట్స్ అప్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఆర్టీసీ బస్ భవన్ అధికారులకు ఎక్స్(ట్విట్టర్) ద్వారా..సదరు డ్రైవర్ పై చర్య తీసుకోవాలని కోరారు.దీనికి స్పందించిన ఆర్టీసీ బస్ భవన్ అధికారులు.ఈ ఉదంతం పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని నల్లగొండ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శనివారం “వినియోగ దారులు హక్కుల దినోత్సవం” నాడు ఈ ఘటన జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News