Wednesday, January 22, 2025

నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ కి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కాసిపేట మండలంలోని కాసిపేట గని సమీపంలో ఆదివారం సాయంత్రం నీళ్ల ట్యాంకర్ బోల్తా పడడంతో ట్యాంకర్ డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు అయ్యాయి. సోమగూడెం వైపు నుండి దేవాపూర్‌కు వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ కాసిపేట గని సమీపంలో అదుపు తప్పి తల క్రిందులుగా పడి పోయింది.

ట్రాక్టర్ ట్యాంకర్ డ్రైవర్ శ్రీశైలంకు ఒక చెయ్యి విరిగి పోయి మొఖం మీద గాయాలు అయినవి. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News