Monday, December 23, 2024

డ్రైవర్‌ లైంగిక వేధింపులు.. ఆటోలోంచి దూకిన బాలిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికి  మహిళలు, మైనర్లు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అల్లరిమూకల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో  డ్రైవర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్‌ బాలిక ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల బాలిక ట్యూషన్‌ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలు దేరింది.

కొంత దూరం వెళ్లాకా ఆటో డ్రైవర్ సయ్యద్‌ అక్బర్‌ హమీద్‌ బాలికకు పలు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అసభ్యంగా మాట్లాడి బాలికను వేధించసాగాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు బాలిక కదులుతున్న ఆటోలో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేసింది. అంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి స్థానికుల సాయంతో బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News