Tuesday, January 21, 2025

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసు

- Advertisement -
- Advertisement -

సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తాం: ఎపి డిజిపి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి వైకాపా ఎంఎల్‌సి అనంత్ ఉదయ్ భాస్కర్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పోలీసుల విచారణ కొనసాగుతోందని పోస్టుమార్టం, వైద్య నివేదకల అనంతరం పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామనిప తెలిపారు. తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో డిజిపి సమీక్ష నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, గృహహింసలపై ఆరా తీశారు.

అనంతరం మాట్లాడిన డిజిపి రాష్ట్రంలోని పలు తాజా అంశాలపై స్పందించారు. విజయవాడ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని, నిర్లక్షంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు డిజిపి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను త్వరలో పునరుద్ధరణ చేస్తామని, నిషేధిత వస్తువులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో సైబర్ క్రైం ఆందోళనకరంగా ఏమీ లేదని, అయినప్పటికీ సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు డిజిపి చప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందన్నారు. ఆ సమయంలోనే నమోదైన క్రైం రేటును పోలీసు శాఖ ప్రామాణికంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి నారాయణ కేసులో ఎపిపి సుజాత సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా సంస్థలు సహకరిస్తే ఫేక్ న్యూస్‌ల వ్యాప్తిని సులభంగా నియంత్రించవచ్చని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News