Thursday, January 23, 2025

కాణిపాకం నుంచి యాదాద్రికి వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ఒక్కసారిగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాబు (50) మృతిచెందగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వెంకటాపురం మండలం అంకన్నగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 40 మందితో యాదాద్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News