Monday, December 23, 2024

చేతుల్లేని యువతికి డ్రైవింగ్ లైసెన్స్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

పుట్టుకతోనే చేతులు లేకపోయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆ యువతి. ఆమె తోటి దివ్యాంగులకు ఆదర్శం. ఆత్మస్థయిర్యం లేనివారికి స్ఫూర్తిదాత. అన్ని అవయవాలూ ఉండి, అసమర్ధులుగా మిగిలిపోయిన వారికి ఆమె కథ ఓ గుణపాఠం. ఆ యువతి కథ తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. ఆమె పేరు జిలుమోల్ మారియట్ థామస్. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జిలుమోల్ వయసు 32 సంవత్సరాలు. కేరళలోని ఇడుక్కికి చెందిన ఈ యువతికి పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. అయినా ఎవరిమీదా ఆధారపడలేదు. కాళ్లనే చేతులుగా చేసుకుని, ముందడుగు వేసింది. అవహేళనలను, అవమానాలను లెక్కచేయలేదు. అనుకున్నది సాధించేందుకు తన కాళ్లనే ఆమె నమ్ముకుంది. ఫ్రీలాన్స్ డిజైనర్ గా పనిచేస్తూ జీవితంలో స్థిరపడేందుకు బాటలు వేసుకుంది. పట్టుదలతో కారు డ్రైవింగ్ నేర్చుకుంది. కాళ్లతోనే ఆమె కారును సునాయాసంగా నడుపుతుంది. అయినా ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు  ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా జిలుమోల్ కు లైసెన్స్ పత్రాలు అందజేయడం విశేషం. ఆసియాలో చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. జయహో జిలుమోల్!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News