- Advertisement -
డమస్కస్: సిరియా మిలిటరీ అకాడమీపై డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా వంద మందికి పైగా మృతి చెందారు. డ్రోన్ల దాడిలో మరో 200 మంది వరకు గాయపడ్డారని మిలిటరీ అధికారులు వెల్లడించారు. సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుక సమయంలో డ్రోన్లతో దాడి జరిగింది. సాయుధ ఉగ్రసంస్థలే డ్రోన్లతో దాడి చేశాయని సిరియా మిలిటరీ ఆరోపణ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా ప్రభుత్వం పేర్కొంది. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.
- Advertisement -