- Advertisement -
దుబాయి: నైరుతి సౌదీ అరేబియా లోని అభా విమానాశ్రయంపై మంగళవారం డ్రోన్‌తో బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒక విమానం దెబ్బ తిన్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. గత 24 గంటల్లో విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. అయితే ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న షియా తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సౌదీ నేతృత్వం లోని సైనిక కూటమి ఈ దాడిపై స్పందించ లేదు. అయితే పేలుడు పదార్ధాలతో వచ్చిన డ్రోన్‌ను అడ్డుకున్నట్టు మాత్రమే తెలియచేసింది. 2015 నుంచి సౌదీ నేతృత్వం లోని సైనిక కూటమి తో పోరాడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటు దారులు సౌదీ లోని సైనిక స్థావరాలు, కీలకమైన చమురు మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్షంగా చేసుకుంటు దాడులు చేస్తున్నారు.
- Advertisement -