Tuesday, November 5, 2024

5 కిలోల ఐఇడి డ్రోన్ కూల్చివేత

- Advertisement -
- Advertisement -

Drone Carrying 5 Kg IED Shot Down By Security Forces

జమ్మూలో ఐబి వెంబడి టెర్రర్ ఆటకట్టు

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లొ ఐఇడి పేలుడు పదార్థాలను తీసుకువస్తున్న ఓ డ్రోన్‌పై పోలీసులు కాల్పులు జరిపి, కూల్చేశారు. దీనితో అతి భారీ స్థాయి ఉగ్రవాద విధ్వంస వ్యూహం విచ్ఛిన్నం అయింది. భారీ ముప్పు తప్పింది. శుక్రవారం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి కనాఛక్ సరిహద్దు మీదుగా డ్రోన్ ఎగురుతూ ఉండగా పోలీసులు పసికట్టారు. వెంటనే పోలీసు విభాగానికి చెందిన క్యూఆర్‌టి బృందం తుపాకులకు పనిచెప్పింది. డ్రోన్‌ను గురిచూసి కాల్చేసింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నేలకూలిన డ్రోన్‌ల దాదాపు 5 కిలోల వరకూ ఐఇడి ఉన్నట్లు తరువాత నిర్థారించారు. ఇది భారీ స్థాయి డ్రోన్ సాయపు సీమాంతర ఉగ్రవాద చర్య అని వెల్లడైంది. ఇటీవలి కాలంలో జమ్మూ ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు డ్రోన్లను పంపిస్తున్నారు. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు అధునాతన డ్రోన్ నిరోధక వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. దీని సాయంతో పోలీసు ప్రత్యేక బృందం ఈ ఐఇడి వాహకపు డ్రోన్‌ను కూల్చేసింది. తెల్లవారుజామున ఒంటిగంట తరువాత తక్కువ ఎత్తున సంచరిస్తున్న ఈ డ్రోన్‌ను పేల్చేసినట్లు , ఈ ప్రాంతంలో ఈ డ్రోన్ ద్వారా భారీ స్థాయిలో ఐఇడిని కిందికి చేరే ప్రయత్నం జరిగిందని అదనపు డిజిపి ముఖేష్ సింగ్ విలేకరులతో తెలిపారు.

ఆరు రెక్కల డ్రోన్ ఇది

ఉగ్రవాద చర్యలకు ఉద్ధేశించిన ఈ డ్రోన్ ఆరు రెక్కలతో కూడి హెక్సా ఎం క్యాప్టర్ అని, ఇది చాలా అధునాతన రీతిలో ఉందని, జిపిఎస్ పరికరం, కంట్రోలర్ వంటివి అమర్చి ఉన్నాయని ఎడిజిపి తెలిపారు. లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు డ్రోన్లను వాడుతున్నట్లు తేలింది. గత ఏడాది కథూవా ప్రాంతంలో భద్రతా బలగాలు ఓ డ్రోన్‌ను కూల్చేశాయి. ఈ డ్రోన్ వరుస సంఖ్య ఇప్పటి పతనం అయిన డ్రోన్ సంఖ్యలో ఒకే ఒక్క అంకె తేడా ఉంది. లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలు ఈ సీరిస్ డ్రోన్లను వాడుకునేందుకు , తమ సీమాంతర ఉగ్రవాదాన్ని వీటిద్వారా సాగించేందుకు వ్యూహరచన చేసుకున్న విషయం ఇప్పటి ఘటనతో నిర్థారణ అయింది. ఇప్పుడు కూల్చేసిన డ్రోన్ విడిభాగాలు చైనా తైవాన్‌లో తయారుచేసినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News