- Advertisement -
చండీగఢ్ : పంజాబ్ లోని అమృత్‌సర్ జిల్లా భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చి వేశాయి. బీఎస్‌ఎఫ్ దళాలు, అమృత్‌సర్ పోలీసులతో కూడిన జాయింట్ పెట్రోలింగ్ పార్టీ లపోకె ప్రాంతంలో భారీ శబ్దం వినిపించడంతో ఆరు రెక్కలు కలిగిన డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపి నేలమట్టం చేశారు.
తరువాత గ్రామంలో గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది ఐదు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని అదుపు లోకి తీసుకున్నారు. డ్రోన్ పరికరాలు అమెరికా, చైనాలో తయారైనవిగా గుర్తించామని పంజాబ్ డీజీపీ తెలిపారు.
- Advertisement -