Monday, December 23, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో టిటిడి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ అనే ఖాతా నుంచి వీడియో అప్‌లోడ్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసినా టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టిటిడి ఇవో ధర్మారెడ్డి స్పందిస్తూ.. ఇది గూగుల్ లేదా త్రీడి ఇమేజ్ అయి ఉంటుందని అన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమలలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదని ధర్మారెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News