Wednesday, January 22, 2025

మోడీ నివాసంపై డ్రోన్ కలకలం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నివాసంపై సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ సంచరించినట్టు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీస్‌లు రంగం లోకి దర్యాప్తు చేపట్టారు. అయితే అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని వెల్లడించారు. ఢిల్లీ లోని లోక్ కల్యాణ్ మార్గ్ లో ప్రధాని మోడీ అధికారిక నివాసం ఉంది. ఆ ప్రాంతం అంతా నో ఫ్లై జోన్ అమలులో ఉంటుంది. మొదట సమాచారం తెలిసిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అలాంటిదేమీ లేదని తేలాక ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News