Thursday, January 23, 2025

భారతీయ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారత్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది భారతీయులను కోస్తా గార్డు నౌక కాపాడింది. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో వాణిజ్య నౌక ఎంవి కెమ్ ప్లూటోపై డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరు రేవుకు ముడి చమురును తీసుకువస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగి, నౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. భారతీయ ప్రత్యేక ఆర్థిక మండలిని గస్తీ కాస్తున్న కోస్తా గారుడ నౌక సిజిఎస్ విక్రమ్ వెంటనే వాణిజ్య నౌక వద్దకు చేరుకుని సిబ్బందిని రక్షించడంతోపాటు మంటలను అదుపులోకి తెచ్చిందని అధికారులు తెలిపారు.

సహాయం కోసం సమీపంలోని అన్ని నౌకలు అక్కడకు చేరుకోవాలని కూడా కోస్తా గార్డు నౌక కోరింది. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ వాణిజ్య నౌక స్వల్పంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు వారు తెలిపారు. కాగా..గత సోమవారం మాల్టాకు చెందిన ఒక రవాణా నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి హైజాక్ చేయగా గాయపడిన ఒక నావికుడిని భారతీయ నేవీ కాపాడిన నేపథ్యంలో ఈ డ్రోన్ దాడి ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరుగురు దోపిడీ దొంగలు అరేబియా సముద్రంలో రవాణా నౌక ఎంవి రుయెన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News