శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం
అర్థరాత్రి ఆకాశవీధుల్లో చక్కర్లు కొడుతున్న కెమెరాలు
నాలుగు రోజులుగా ఇదే తంతు
అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ వర్గాలు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలు నాలుగు రోజులుగా కలకలం రేపుతున్నాయి. రాత్రిపూట తిరుగుతున్న డ్రోన్ కెమెరాలు ఇప్పుడు ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా మారాయి. అర్ధ రాత్రిపూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్న క్రమంలో డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దొరకలేదు. దీంతో శ్రీశైలం చుట్టు ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఎపి, తెలంగాణ మధ్య జలవివాదం, మరోవైపు హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల ముఠా పని అయి ఉంటుందా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా డ్రోన్లు తిరుగుతున్న సమయంలో పట్టుకునేందుకు దేవస్థానం, భద్రతా సిబ్బంది ప్రయత్నించినా దొరకలేదు. ఆకాశంలో బాగా ఎత్తుగా వేగంగా ఎగిరిపోతుండడంతో పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలావుండగా నాలుగు రోజుల కిందట శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు వద్ద విశ్వామిత్ర మఠంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు సమాచారం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ బోడర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తుండగా.. కొన్నింటిని సైన్యం పేల్చివేసింది.. తాజాగా, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడడం, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే, సమయంలో తాజాగా శ్రీశైలంలో అనుమానాస్పద డ్రోన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Drones Roaming at Srisailam Temple