Sunday, November 3, 2024

జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

Drones used for attack on Jammu Air Force base

న్యూఢిల్లీ: జమ్మూ విమానాశ్రయంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన జంట పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని వెల్లడైంది. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు తెలిందని జమ్మూకాశ్మీర్ డిజిపి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. విమానాశ్రయంలో ఐదు నిమిషాల వ్యవధిలో జంటు పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి భవనం పైకప్పు ఎగిరిపడింది. పేలుళ్లకు దేశంలోనే తొలిసారి డ్రోన్లను ఉపయోగించినట్టు ప్రాథమిక విచారణలో డిజిపి తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన జవాన్లు గాయపడ్డారు. బిల్డింగ్ స్పల్పంగా ధ్వంసం అయింది. ఎయిర్ పోర్ట్ హై సెక్యూరిటీ ప్రాంతంలోనే బాంబులు వేయడంతో వాయుసేన అప్రమత్తమైంది. మరో వైపు నార్వాయ్ లో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చుశారు. అతని దగ్గర నుంచి ఐదు కిలోల ఐఇడి స్వాధీం చేసుకున్నారు. ఘటనాస్థలిని బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి. జమ్మూ విమానాశ్రయం లో పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు.

Drones used for attack on Jammu Air Force base

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News