Sunday, December 22, 2024

భారత్‌లో కొవిడ్-19 కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్-19 కేసులు గత 24 గంటల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 234 సాంక్రమిక కేసులే రిపోర్టయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. క్రియాశీలక కేసులు 3,502కు పడిపోయాయి. కాగా ఇప్పటి వరకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,31,878 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు కొవిడ్-19 వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గిపోయింది. వయోవృద్ధులు, ఆరోగ్య అంతంత మాత్రంగా ఉన్న వారే ఈ వైరస్ రిస్క్‌ను కలిగి ఉన్నారని వార్త. అయితే కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని డాక్టరుల సలహా ఇస్తున్నారు.

దాదాపు 4.45 కోట్ల మంది కరోనా వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 467 మంది కోలుకున్నారు. ప్రస్తుత రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. వ్యాధిని నిరోధించడానికి జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. ఇదిలావుండగా కొవిడ్-19ని ఎదుర్కొనేందుకు టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ అనే ఐదు అంతెల వ్యూహాన్ని అనుసరించాలని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. గత 24 గంటల్లో 97,087 పరీక్షలను నిర్వహించారు.

ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ డ్రయివ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 220.67 కోట్ల వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు ఇచ్చారు. గత 24 గంటల్లో 310 వ్యాక్సిన్ డోస్లను ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News