Sunday, November 17, 2024

మిగతా రాష్ట్రాల్లో డ్రాప్ అవుట్‌లు… తెలంగాణలో మాత్రం డ్రాప్ ఇన్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మిగతా రాష్ట్రాల్లో డ్రాప్ అవుట్‌లు ఉంటే.. తెలంగాణలో మాత్రం డ్రాప్ ఇన్‌లు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యారంగం కోసం తీసుకున్న చర్యలను పేర్కొంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మ విశ్వాసం అన్న ఆయన ప్రతి తరగతి గది తరగని విజ్ఞాన గని అని పేర్కొన్నారు. ఆ నాలుగు గోడలే దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని వ్యాఖ్యానించారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాకుండా అక్షరాలా ఆచరించింది తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవంతో తెలంగాణ ప్రభుత్వం యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు కొత్తగా లక్షకు పైగా విద్యార్థుల బలమైన అడుగులు పడ్డాయని తెలిపారు. వ్యవసాయంలోనే కాదు, విద్యారంగంలోనూ వలసలు వాపస్ అయ్యాయని, రేపటి పౌరుల భవిష్యత్తుపైనే ప్రభుత్వ ఫోకస్ అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు అని గుర్తు చేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయాన్ని భారంగా కాకుండా బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వ్యవసాయంలోనే కాదు.. విద్యారంగంలోనూ వలసలు వాపస్ రేపటి పౌరుల భవిష్యత్తుపైనే ప్రభుత్వ ఫోకస్, మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్ లు.. తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్ లు, కేవలం ఒక్క ఏడాదే, ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు, కొత్తగా లక్షకు పైగా విద్యార్థుల బలమైన అడుగులు, విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం, ప్రతి తరగతి గది, తరగని విజ్ఞాన గని, ఆ నాలుగుగోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలు, ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. అక్షరాలా ఆచరించింది తెలంగాణ ప్రభుత్వమన్నారు.

తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవం యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందని తెలిపారు. మన ఊరు-మన బడితో సమూల మార్పులు 26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనమైనా.. సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం బోధనైనా, ప్రతి ఆలోచన విప్లవాత్మకం, ప్రతి నిర్ణయం ప్రతిష్ఠాత్మకమన్నారు. మన భావితరాలకు బంగారు బాటలేసే.. ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ, మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు యావత్ అధికార యంత్రాంగానికి, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News