Monday, November 25, 2024

మైసూరులో దసరా ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

Draupadi murmu

మైసూరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26న మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ప్రారంభించారు. చరిత్ర , జానపద కథలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, మానవ పాత్రల పండుగలు భారతదేశం అంతటా జరుపుకుంటారని, మైసూరులో దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి,  సంప్రదాయానికి సంబంధించిన వేడుక అని ముర్ము తెలిపారు.

కర్ణాటకలో దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని, జైన, బౌద్ధమతాలకు సంబంధించిన ప్రాచీన ప్రదేశాలు, ఆదిశంకరాచార్య స్థాపించిన శృంగేరి మఠం, కలబురగిలోని సూఫీ సంస్కృతి, 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవన్న అనుభవ మంటపం వంటి వాటిని ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్‌లో భారతదేశం అందుకున్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డిఐ) 53% సాధించడం ద్వారా,  కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో,  నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21 దేశంలోనే కర్నాటక అగ్రస్థానంలో ఉందన్నారు. దసరా వేడుకలను ఆరంభించేందుకు తమ ఆహ్వానాన్ని ముర్ము మన్నించినందుకు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కృతజ్ఞతలు వ్యక్తం చేశఆరు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ కూడా ఈ దసరా ప్రారంభ వేడుకలలో పాల్గొన్నారు. ఇదివరలో ఆయన టివిలో ఆ కార్యక్రమాలు చూసేవారు. మంత్రి ఎస్.టి. సోమశేఖర్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నాటక మంత్రి వి. సునీల్ కుమార్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News