Monday, January 6, 2025

చిన్నారులతో కలిసి క్యారమ్స్ ఆడిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాఠశాల చిన్నారులతో ఆటలు ఆడి తన విలువైన సమయాన్ని సరదాగా గడిపారు. బుధవారం సిల్వాస్సా లోని జందాచౌక్‌లో గల స్వామి వివేకానంద విద్యామందిర్‌ను రాష్ట్రపతి ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. పిల్లల పేర్లు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థితో ముర్ము, క్యారమ్స్ ఆడారు. అనంతరం చిన్నారులతో ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News