Monday, December 23, 2024

జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

 

Droupadi Murmu

న్యూఢిల్లీ:భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత 21 మంది గన్ సెల్యూట్ స్వీకరిస్తారు.  పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగే ఈ వేడుకలో సోమవారం ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

రాష్ట్రపతి ప్రమాణస్వీకారం వేడుకకు ముందు, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, ఎన్నికైన రాష్ట్రపతి ఉత్సవ ఊరేగింపుతో పార్లమెంటుకు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు , ప్రధాన పౌర, సైనిక అధికారులు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం హాజరవుతుంది. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము గురువారం  ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఏకపక్షంగా ఓడించి చరిత్ర సృష్టించారు. ముర్ముకు 6,76,803 ఓట్లు రాగా, సిన్హాకు 3,80,177 ఓట్లు వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రపతి అయిన రెండో మహిళ ఆమె. ఇదివరలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పనిచేశారు. కాగా భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్మును పేర్కొనవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News