Monday, January 20, 2025

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ?

- Advertisement -
- Advertisement -

Droupadi Murmu’s village to finally get electricity

రాయ్‌రంగపూర్ : ఒడిషాలోని కుగ్రామం ఉపర్బెడాకు ఇన్నేళ్లకు కరెంటు వస్తోంది. ఈ గ్రామం ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపదీ ముర్మూ స్వగ్రామం. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా మయూర్బంజ్ జిల్లాలోని ఈ గ్రామానికి విద్యుత్ లేదని ఇటీవలే పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. దీనితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చొరవతో హుటాహుటిన కరెంట్ లైన్లు వేసే పనులు జోరందుకున్నాయి. అయితే ముర్మూ ఈ గ్రామంలో నివసించడం లేదు. ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోని మున్సిపల్ పట్టణం రాయ్‌రంగపూర్‌లో ఉంటున్నారు. ఇప్పుడు దాదాపుగా దేశ రాజధానికి తమ మకాం మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ముర్మూ అభ్యర్థిత్వానికి ఒడిషాలోని అధికార బిజెడి మద్దతు ప్రకటించింది. ముర్మూ పూర్వపు గ్రామానికి విద్యుత్ లేదనే వార్తతో కదిలిన అధికార యంత్రాంగం ఆదేశాలతో రాష్ట్రంలోని టాటా విద్యుత్ పంపిణి సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఇప్పుడు పూర్తి సాధనాసంపత్తితో ఈ గ్రామానికి చేరారు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ కరెంటు రావడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఢిల్లీలో ముర్మూమేడం రాష్ట్రపతి పీఠంలో కూర్చోవడానికి ముందే ఇక్కడ కరెంటు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. అంతదాకా ఎందుకు పనిచేపట్టిన 24 గంటల్లోపే విద్యుత్ వెలుగులు ఖాయం అని స్థానిక మున్సిపల్ అధికారి ఒకరు స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News