Monday, December 23, 2024

డిఆర్‌ఎస్ అంటే.. ‘డెఫినిట్లీ రోహిత్ సిస్టమ్’

- Advertisement -
- Advertisement -

మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్

Sunil Gavaskar prediction India will beat England 4-0
అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ తన ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టాడని కితాబిచ్చాడు. అతని కెప్టెన్సీకి 10కి 9.99 మార్కులు ఇచ్చాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రివ్యూల విషయంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. తీసుకున్న మూడు రివ్యూలు భారత్‌కు అనుకూలంగా వచ్చాయి. రివ్యూలు ఉపయోగించడంలో మహేంద్రసింగ్ ధోనీని మించిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతలా అంటే డిఆర్‌ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనే పిలిచేంతలా అతను పాపులర్ అయ్యాడు. ఇప్పుడు దానికి మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కొత్త పేరు పెట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లోని 22వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లో బ్రూక్స్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల చాహల్ విసిరిన బంతి.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ రిషభ్ చేతుల్లోకి వెళ్లింది. భారత క్రికెటర్లు ఔట్ కోసం అప్పీలు చేయగా, అంపైర్ నిరాకరించాడు. అనంతరం డిఆర్‌ఎస్ కోరే ముందు కెప్టెన్ రోహిత్.. పంత్ ఒపీనియన్ అడగ్గా అతడు స్పష్టంగా చెప్పలేకపోయాడు. వెంటనే కోహ్లీ వచ్చి తీసుకోమని చెప్పగా, రోహిత్ మరేం ఆలోచించకుండా డిఆర్‌ఎస్ తీసుకుని విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో కామెంటరీ చేస్తున్న సునీల్ గవాస్కర్.. ఇకపై డిఆర్‌ఎస్ అంటే ‘ధోనీ రివ్యూ సిస్టమ్’ కాదని.. ‘డెఫినిట్లీ రోహిత్ సిస్టమ్’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News