Tuesday, January 21, 2025

డ్రగ్స్ కు బానిస… తల్లి, తండ్రి, నాయనమ్మ, చెల్లిని చంపి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ యువకుడు తన కుటుంబంలో నలుగురి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేశవ్ (25) అనే యువకుడు తన కుటుంబంలోని నాయనమ్మ దీవానాదేవి(75), తండ్రి దినేష్(50), తల్లి దర్శన(45), సోదరి ఊర్విశ(18) సభ్యులతో కలిసి ఉంటున్నాడు. కేశవ్ డ్రగ్స్ బానిసగా మారడంతో అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ దిగాడు. నాయనమ్మ, తండ్రి, తల్లి, సోదరిని హత్య చేశాడు. ఇంట్లో గొడవ జరుగుతుండడంతో పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి నలుగురిని నిందితుడు నరికి హత్య చేశాడు. ఇల్లు మొత్తం రక్తపు మడుగులా మారింది. డబ్బుల కోసం కేశవ్ తరుచూ కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడని పోలీసులకు ఇరుగుపొరుగు వారు చెప్పారు. మంగళవారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఎటిఎం చోరీ కేసులో గతంలో కేశవ్ జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News