Wednesday, January 22, 2025

బాలానగర్ లో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ అమ్ముతున్న యువకుడిని ఎస్ టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు కూకట్‌పల్లి వడ్డపల్లి ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతుండగా షేక్‌ ఫరూక్ అనే యువకుడిని ఎక్సైజ్‌ సిఐ టి.శ్రీధర్‌, ఎస్సై ఎస్‌ రఘు, సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం రాత్రి పోలీసులు నిందితుడిని పట్టుకొని ఆతడి వద్ద 4.1 గ్రాముల ఎడిఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం షేక్‌ ఫరూక్ ను అరెస్టు చేసి జె ఎఫ్ సి ఎం కోర్టు ముందు హాజరుపరిచామని ఎస్ టి ఎఫ్ సిఐ శ్రీధర్‌ తెలిపారు. 23 సంవత్సరాల వయస్సు ఉన్న షేక్‌ ఫరూక్ కు చెన్నెయ్‌లో బిటెక్ చదువుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దీంతో మిత్రులు ఇచ్చిన సలహాల మేరకు బెంగూళూరు నుంచి దొంగ చాటుగా డ్రగ్స్‌ తీసుకొని వచ్చి హైదారాబాద్‌లో అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎస్టిఎఫ్ పోలీసులు తెలిపారు. ఒక గ్రామంలో ఎండిఎంఎను రూ. 12 వేల చొప్పున అమ్మకాలు సాగిస్తున్నట్లు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తెలియ వచ్చింది. ఎస్ టి ఎఫ్ పోలీసులు పట్టుకున్న ఎండిఎంఎ విలువ రూ. 50 వేల మేరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుళ్లు లేఖాసింగ్‌, అలీమ్‌లు, కానిస్టేబుల్‌ కార్తిక్‌, రాజేష్‌, వికాష్‌లు పాల్గొన్నారు. డ్రగ్స్‌ను పట్టుకున్న సిఐ,ఎస్సై సిబ్బందిని ఎస్టిఎప్‌ డిఎస్ పి తిరుపతి యాదవ్‌ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News