Wednesday, January 22, 2025

డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ రెయిడ్స్ లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్టు రామ్ చంద్ తెలిపాడు. దీంతో, టిఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ ను కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో, ఈ నెల 16న హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహిం చిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి విదితమే. నవదీప్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. గీత నెల 31న మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ బ్యూరో 13 మందిని అరెస్ట్ చేసింది. నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News