Sunday, December 22, 2024

టోలీచౌకిలో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Drugs confiscation in Toli Chowki

ఎండిఎంఏ, ఎల్‌ఎస్‌డి బ్లోట్స్

మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 210 ఎక్టసీ పిల్స్, 27 ఎస్‌ఎస్‌డి బ్లోట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.15లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం….. ఎపిలోని చిత్తూరు జిల్లా, మదనపల్లికి చెందిన నల్లపురెడ్డి రఘువంశీధర్ రెడ్డి కూకట్‌పల్లి, గోకుల్ ప్లాట్స్, ఆద్యా క్యాస్టిల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు, గొట్టిముక్కల పృథ్వీ రాజ్ ఇద్దరు డ్రగ్స్‌ను గోవా నుంచి తీసుకుని వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.

వారి వద్ద తక్కువ ధరకు తీసుకుని నగరంలోని అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు. ఇలాగే రఘువంశీరెడ్డి 2017లో డ్రగ్స్ విక్రయిస్తుండగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు టోలీచౌకి వద్ద గస్తీ నిర్వహిస్తుండగా నిందితులు అనుమానస్పదంగా కన్పించారు. వారిని ఆపి తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కూకట్‌పల్లిలోని వారి నివాసంలో తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఈఐలు జూపల్లి రవి, నరేందర్, ఈఎస్‌ఐలు నిజాముద్దిన్, సంగీత, ఈహెచ్‌సి మల్లికార్జున్, ఈసి అక్షర, రాకేష్, శ్రీకాంత్, ప్రకాష్, అన్నోజి రావు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News