Thursday, January 23, 2025

టిఫిన్ సెంటర్‌లో డ్రగ్స్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా

రెడ్‌హ్యాండెడ్‌గా ముగ్గురిని పట్టుకున్న పోలీసులు

భారీగా కొకైన్, ఎంబిఎంఎ మాత్రలు స్వాధీనం

మన తెలంగాణ/రాజేంద్రనగర్: మాదక ద్రవ్యాలను అక్ర మంగా నగరానికి తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయ త్నిస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్‌ఒటి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకుని పోలీసులు కేసులు నమోదు చే శారు. హైదరాబాద్‌లో సోమవారం డిసిపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్ర నగర్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జగ దీశ్వర్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడిం చారు. గచ్చిబౌలి నానక్‌రామ్ గూ డలో నివాసం ఉంటున్న కరీంనగర్ గన్నేరు గూడ ప్రాంతానికి చెందిన లింగంపల్లి అనురాధ (34) వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ గచ్చిబౌలి జెబికాలనీ లో నివాసం ఉంటున్న ప్రకాశం జిల్లా నారపల్లి గ్రామానికి చెందిన సా నికొమ్ము ప్రభాకర్‌రెడ్డి(38), నవ నిర్మాణ్‌నగర్ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ హోటల్ వ్యాపారం చేస్తున్న హనుమానగర్ గుంటూరు పట్టణానికి చెందిన వెంకట శివ సాయి కొంత కాలంగా డ్రగ్స్ అల వాటు పడి స్నేహితులుగా మారారు.

ఈ ముఠాలో ఎ1గా ఉన్న లింగంపల్లి అ నురాధకు ప్రగతి నగర్‌లో డ్రగ్స్‌కు అలవాటు పడిన పొ రుగువారితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె గోవాకు వెళ్లి అక్కడ డ్రగ్స్ వివరాలు, ధరలు తెలుసుకునే క్రమంలో నైజీరియాకు చెందిన జెమ్స్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసేది. అనంతరం ట్రావెల్ బస్సుల ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా నగరానికి మాదక ద్రవ్యా లను తీసుకువచ్చి సరఫరా చేసేది. ఈ కేసులో రెండవ నిందితురాలిగా ఉన్న మహాలక్ష్మీ ఓ టిఫిన్ సెంటర్ యజయాని పరిచయం, సానిహిత్యంతో డ్రగ్స్ తీ సుకునే వరకు వెళ్లారు. ఈ కోవలో మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్ పక్కనే పల్లెటూరు పుల్లట్లు అనే హోటల్ ప్రారంభించ డానికి సాయం చేయమని అనురాధను ప్రభాకర్‌రెడ్డి కోరాడు. దీంతో గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు నగరంలో విక్రయిం చి డబ్బు సంపా దించవచ్చని పథకం వేసుకున్నారు. పథకంలో భాగంగా ఈనెల 10వ తేదీ సాయత్రం 3.50 గంటల ప్రాంతంలో గోవా నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్ కోసం ముగ్గురు వేర్వే రుగా వాహనాల్లో ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని ఇంద్రా రెడ్డినగర్ వద్దకు వచ్చారు. అప్పటికే సమాచారం ఉన్న పోలీసులు వారి పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపే యేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.

ముగ్గురు నిందితుల ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 51.45 గ్రాముల 48 కొకైన్ క్యూబ్‌లు, ఎండిఎం ఎ మాత్రలు 44, ఎండిఎంఎ క్రిస్టల్ 8 గ్రాములు, ఆయిల్ బర్నర్ జార్‌లు రెండు, గురక పైపులు రెండు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉప యోగించిన రెండు ఐఫోన్ 14 ప్రో, 11 ప్రో ఒకటి, 13 ప్రో 1తోపాటు ఒక సామ్ సంగ్ ఎస్ 22 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక టిఎస్07 జెజడ్ 0007 ఒల్వా కారు, ఎపిక్యూఎల్ 6777 మహీం ద్ర ఎక్స్‌యూవి కారు, టిఎస్07జిసి 3568 టియాగో కారు, రూ. 95 వేల 500 నగదును స్వాధీనం చేసుకు న్నారు. ఈ డ్రగ్స్ కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు, మోకిల ఇన్‌స్పెక్టర్ పి. నరేష్, రాజేంద్రనగర్ ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్ రామణారెడ్డి తదితరులను డిసిసి జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌వోటి డిసిపి ఎంఎ రషీద్, అడిషనల్ డిసిపి పి.నారాయణ, ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News