Wednesday, November 13, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి, వినియోగిస్తున్న యువకుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఫలక్‌నూమ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 26 గ్రాములు ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.3,12,000 ఉంటుంది. సౌత్ జోన్ డిసిపి సాయిచైతన్య శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫలక్‌నూమా,వట్టేపల్లికి చెందిన ఎండి అమీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని కేశవగిరికి చెందిన జుబేయిర్ అలీ ఫిష్‌ఫ్రై వ్యాపారం చేస్తున్నాడు. ముంబాయికి చెందిన రెహాన్ పటేల్ అలియాస్ అర్షద్ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. అమీర్‌కు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండడంతో ముంబాయికి వెళ్లి అక్కడ కొన్ని సినిమాల్లో నటించాడు.

ఈ క్రమంలోనే డ్రగ్స్‌కు బానిసగా మారాడు, తర్వాత నగరానికి వచ్చిన నిందితుడు ఇక్కడ డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. ముంబాయికి చెందిన రెహాన్ పటేల్ వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి విమానంలో నగరానికి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. డ్రగ్స్‌ను జుబేయిర్ అలీకి విక్రయించేందుకు ఎక్సైడ్ పెట్రోల్ పంప్ వద్దకు రాగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న రెహార్ పటేల్ పరారీలో ఉన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్‌నూమా పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News