Monday, December 23, 2024

సంగారెడ్డి లో రూ.3 కోట్ల డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు డ్రగ్ మాఫియా గుట్టురట్టు చేశారు. జిన్నారంలో పాడుబడ్డ పరిశ్రమలో డ్రగ్స్  తయారు చేస్తున్న ముఠా పై యాంటీ  నార్కోటిక్ పోలీసులు,   సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేశారు. ఈ దాడి లో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితుల నుండి 14 కిలోల ఆల్ఫ్రజోలం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.3 కోట్ల పైన ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News