Thursday, January 23, 2025

గ్రేటర్ నొయిడాలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నొయిడా : గ్రేటర్ నొయిడాలో మూడంతస్థుల భవనంలో విదేశీయులు నడుపుతున్న డ్రగ్స్ తయారీ లేబొరేటరీ రాకెట్‌ను బుధవారం పోలీస్‌లు ఛేదించారు. ఆఫ్రికాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.200 కోట్ల విలువైన మెథామెటఫిన్ (ఎండిఎంఎ)డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గ్రేటర్ నొయిడాలో సెక్టార్ థేటా 2లో వీరు మూడంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నారని, గౌతమ్ బుధ్‌నగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీసింగ్ చెప్పారు. మెథామెటిఫిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News