- Advertisement -
మెక్సికో: మెక్సికోలో మాదకద్రవ్యాల ముఠా జరిపిన దాడిలో 8మంది పోలీసులు, ఐదుగురు దర్యాప్తు అధికారులు మృతి చెందారు. గురువారం ఈ ఘటన జరిగింది. దాంతో, సాయుధ ముఠా సభ్యులకు స్థావరంగా భావించే మెక్సికో నైరుతి ప్రాంతంలోని గ్రామాల్లో గాలింపును తీవ్రం చేశారు. అందుకోసం సైనికులుసహా నేషనల్‌గార్డ్‌ను రంగంలోకి దించినట్టు ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ రోడ్రిగో మార్టినెజ్ సెలిస్ తెలిపారు. మూడువైపుల నుంచి దళాలు ముందుకు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. మెక్సికో నగర శివారు ప్రాంతాల్లోని పర్వతాలు, పొదలు స్మగ్గింగ్ ముఠాలకు స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి. 2019 అక్టోబర్ తర్వాత ఆ దేశంలో పోలీసులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. మిచోక్యాన్ రాష్ట్రంలో జరిగిన అప్పటి ఘటనలో 14మంది పోలీస్ అధికారులు చనిపోయారు.
- Advertisement -