Monday, December 23, 2024

హైదరాబాద్‌లో మరోమారు డగ్స్ ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మరో మారు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. టిజిన్యాబ్, బహదూర్‌పురా పోలీసులు సంయుక్తంగా ఈ ముథాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముఠా సభ్యుల నుంచి 34 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్, ఆరు సెల్‌ఫోన్‌లు.. మొత్తంగా నాలుగు లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10వ తేదీన టిఎస్‌న్యాబ్, బహదూర్ పోలీసు సిబ్బందికి డ్రగ్స్ విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. బహదూర్‌పురాలోని హసన్ నగర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో వినియోగదారులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు అంబర్‌పేటకు చెందిన సయ్యద్ ఫైసల్, మస్రత్ ఉన్నీసా బేగం (సయ్యద్ ఫైసల్ భార్య), దబీర్‌పురాకు చెందిన మహ్మద్ అబ్రార్ ఉద్దీన్, బహదూర్‌పురాకు చెందిన రహమత్ ఖాన్ (వాటర్ ప్లాంట్ వ్యాపారం), బెంగళూరుకు చెందిన జువైద్ ఖాన్ (కారు డ్రైవర్)లు ఉన్నారు. సయ్యద్ ఫైసల్, మస్రత్ ఉన్నీసా బేగం, మహమ్మద్ అబ్రార్ ఉద్దీన్, రహమత్ ఖాన్‌లపై గతంలో కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. వీరంతా ముఠా సభ్యులుగా ఏర్పడి నార్కొటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరులో ఎండిఎంఎని తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరమైన వినియోగదారులకు గ్రాముకు రూ.8 వేల చొప్పున విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్, బాలానగర్ పరిధిలో గతంలో రెండు ఎన్‌డిపిఎస్ కేసుల్లో అరెస్టయ్యాడు. మళ్లీ డ్రగ్స్ బిజినెస్ ప్రారంభించాడు. అతను తన భార్య మస్రత్ ఉన్నిసా బేగం, ఇతర సహచరులు మహ్మద్ అబ్రార్ ఉద్దీన్, రహ్మత్ ఖాన్, జునైద్ ఖాన్‌లతో కలిసి బెంగళూరు నుండి తమకు తెలిసిన వ్యక్తుల నుండి MౄMA డ్రగ్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్నారు. అయితే ఈ ముఠా సభ్యుల నుంచి హైదరాబాద్‌లో 19 మంది వినియోగదారులు క్రమం తప్పకుండా ఎండిఎంఎను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. సయ్యద్ ఫైసల్ తన భార్యను డ్రగ్స్ రవాణాకు వినియోగించేవాడని తేలింది. పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి, రవాణాదారుగా మహిళను పోలీసులు అనుమానించలేదు.వారం రోజుల క్రితం నిందితులు బెంగళూరు వెళ్లి అక్కడ నిందితుడు జునైద్ ఖాన్‌ను కలిశారు, వారందరూ తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా 34 గ్రాముల ఎండిఎంఎను కొనుగోలు చేసి హైదరాబాద్ వచ్చి తమకు చిక్కారని పోలీసులు వెల్లడించారు.

సాధారణ ప్రజలకు పోలీసుల సూచన :-
ఇటీవలి కాలంలో అనేక మంది యువకులు/విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడడం, నేరాలు చేయడం, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మనం చూశాం. ఈ విపత్తుకు అనేక కుటుంబాలు బలి అయ్యాయి. యువత/విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, పోలీసులను సంప్రదించాలని లేదా ఫోన్ నెం.8712671111లో పోలీసులకు సమాచారం అందించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు యువతకు/విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని, డ్రగ్ ఫ్రీ సిటీ కోసం పాటుపడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News