ఎనిమిది మందిని అరెస్టు చేసిన టిజి న్యాబ్
గచ్చిబౌలి పోలీసుల విచారణ
మన తెలంగాణ/ సిటీ బ్యూరో:పబ్ లో ఆదివారం మధ్యాహ్నం ఓ పార్టీ జరిగింది. పార్టీ లో 25 మంది పాల్గొనగా కొందరు డ్రగ్స్ తీసుకుం టున్నట్లు టిజి న్యాబ్ అధికారులకు తెలిసింది. వెం టనే అప్రమత్తమైన టిజి న్యాబ్ పోలీసులు, సైబరా బాద్, రాచకొండ పోలీసులతో కూడిన 22 మంది పోలీస్ అధికారులతో కలిసి టీములను ఏర్పాటు చేశారు. వారు పబ్బుపై దాడి చేసి పార్టీలో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఎనిమిది మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ముందుగా 14 మందిని అదుపులోకి తీసుకుని పరీ క్షలు నిర్వహించగా, అందులో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఎనిమిది మంది గంజాయి, కొకైన్, అంఫెటమైన్, మెథంఫెటమైన్ తీసుకున్నట్లు తెలిసింది. పబ్బులో ఉపయోగించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ర్యాపిడ్ టెస్ట్..
డ్రగ్స్ తీసుకున్నవారికి అక్కడే పరీక్ష చేసేందుకు గతంలోనే టిజి న్యాబ్ అధికారులు లేటెస్ట్ ర్యాపిడ్ రిజల్ట్ యూరిన్, సలీవా టెస్టింగ్ కిట్లను కొనుగో లు చేశారు. వాటి ఆధారంగానే టిజి న్యాబ్ అధికా రులు డ్రగ్స్ తీసుకున్న వారికి పరీక్షలు నిర్వ హించారు. ఇందులో పాజిటివ్ రావడంతో వారిని అరెస్టు చేశారు.
మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -