Monday, January 20, 2025

చైతన్యపురిలో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః నగరంలో డ్రగ్స్ పట్టివేత మరోసారి కలకలం సృష్టించింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5గ్రాముల ఎండిఎంఏ, నాలుగు గ్రాముల ఎల్‌ఎస్‌డి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని భీమవరానికి చెందిన కనకరాజు, లక్ష్మినరసింహరాజు, హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జలిమ్ శ్యామ్‌రాయ్ కలిసి అవసరం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

వీరు గోవాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ హబీబ్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరాకి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయించి డబ్బులు సంపాదించాలని నిందితులు ప్లాన్ వేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులపై ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News