కరీంనగర్: మాదకద్రవ్యాలను నిర్మూలించేకన్నా నివారణే ఉత్తమ మార్గమమని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై కళంకం, వివక్షను ఆపండి, నివారణను బలోపేతం చేయండి అనే థీమ్‌తో సోమ వారం ఉదయం కరీంనగర్ పట్టణంలోని గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు పాఠశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.
అ నంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాదకద్రవ్యాలనే డ్రగ్స్ కేవం ఫౌడర్, లిక్విడ్ రూపంలో మాత్రమే లభించేవి కావ ని, వ్యాధుల కొరకు తీసుకునే మందులలో కూడా డ్రగ్స్ ఉంటుందన్నారు.
అదే విధంగా డ్రగ్స్‌ను వాడే వారిని చిన్నచూపు చూ డకుండా వారి సమస్యను అర్థం చేసుకొని దాని నివారణకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల ని యంత్రణ పోస్టర్ ఆవిష్కరించి ద్రవ్య నియంత్రణకు పాటుపడతామని యువత, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో సీపీ సుబ్బారాయుడు, డీడబ్లువో సబితా, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.