Friday, December 20, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విదేశాల నుంచి తీసుకుని వస్తున్న డ్రగ్స్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఎత్తున పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.50కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి కొకైన్‌ను లేడీస్ హ్యాండ్ బ్యాగులో బ్రౌన్ టేపు వేసి డ్రగ్స్ తరలిస్తుండగా డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి వస్తున్న వ్యక్తి ట్రావెల్ బ్యాగులో లేడీస్ హ్యాండ్ బ్యాగులతో వచ్చాడు. అనుమానం వచ్చిన డిఆర్‌ఐ అధికారులు వాటిని తెరిచి చూడగా లేడీస్ హ్యాండ్ బ్యాగులో బ్రౌన్ టేపు వేసి కొకైన్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఐదు కిలోల కొకైన్ లభించింది. డ్రగ్స్ తీసుకువస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News