Monday, January 20, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని టిస్‌నాబ్, మలక్‌పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎండిఎంఏ 14 గ్రాములు, చరాస్ 20 గ్రాములు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని మలక్‌పేటకు చెందిన మహ్మద్ షాహీద్ అలీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి సాహిద్ అలీ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. తెలిసిన వారి వద్ద నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.

ఈ క్రమంలోనే డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో డ్రగ్స్‌కు నగరంలోని డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు నిందితుడు పెద్ద ఎత్తున ఎండిఎంఏ, చరాస్‌ను కొనుగోలు చేశాడు. వాటిని అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం టిఎస్ నాబ్, మలక్‌పేట పోలీసులకు తెలియడంతో నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్, డానియల్, శ్రీనివాస్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News